దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు యూనిఫైయిడ్ పేమెంట్ ఇంటర్‌పేస్ (యూపీఐ)ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.
2027 నాటికి ఈ రెండు ప్రాంతాల్లోనూ యూపీఐని లాంచ్ చేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ( ఎన్‌ఐపీఎల్) సీఈఓ రితీష్ శుక్లా తెలిపారు.
దీనిపై పలు దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఆర్‌బీఐ ఆధీనంలో ఎన్‌పీసీఐ లాభాపేక్షలేని సంస్థగా దేశంలో రిటైల్ పేమెంట్ సిస్టమ్‌ను నిర్వహిస్తోంది. ఆగస్టులో యూపీఐ లావాదేవీలు సంఖ్య 15 బిలియన్లుగా నమోదయ్యారు.
ఎన్‌పీసీఐకి చెందిన ఎన్‌ఐపీఎల్ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని 20 దేశాలతో యూపీఐ తరహా విధానాన్ని డెవలప్ చేసే విషయంలో చర్చించినట్లు తెలిపారు.