Saturday ,March 7, 2026, 1:58 pm
Kuhu World
HomeBusiness1'ఏఐ'తో మాస్ లే అఫ్స్ : HCL మాజీ CEO వినీత్ నాయ‌ర్ వార్నింగ్‌

‘ఏఐ’తో మాస్ లే అఫ్స్ : HCL మాజీ CEO వినీత్ నాయ‌ర్ వార్నింగ్‌

spot_img
spot_img

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాక‌తో ముఖ్యంగా ఐటీ ప‌రిశ్ర‌మ‌లో కొలువుల కోత‌పై ఆందోళ‌న నెల‌కొంది. మ‌నుషులు చేసే ఉద్యోగాల‌ను ఏఐ రీప్లేస్ చేస్తుంద‌నే భ‌యాలు టెకీల్లో గుబులు రేపుతున్నాయి.

ఏఐ టూల్స్‌తో ఐటీ ప‌రిశ్ర‌మ‌లో సిబ్బంది అవ‌స‌రాల‌ను 70 శాతం త‌గ్గించ‌వ‌చ్చ‌ని హెచ్‌సీఎల్ మాజీ సీఈవో బాంబు పేల్చారు. ఆటోమేష‌న్‌తో మాస్ లేఆఫ్స్ త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకునే బ‌దులు ప్ర‌స్తుత ఉద్యోగుల నైపుణ్యాల‌ను మెరుగుప‌ర‌చాల‌ని సూచించారు.

Fashion Ad1

చాట్‌జీపీటీ, జెమిని, కోపైల‌ట్ వంటి ఏఐ టూల్స్ రాక‌తో లేటెస్ట్ టెక్నాల‌జీ టూల్స్‌తో సంప్ర‌దాయ ఉద్యోగాలు క‌నుమరుగవుతాయ‌నే ఆందోళ‌న‌ల మ‌ధ్య నాయ‌ర్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రిచుకున్నాయి.

ఏఐ టూల్స్ కార‌ణంగా కంపెనీల హైరింగ్ అవ‌స‌రాలు 70 శాతం త‌గ్గుతాయ‌ని నాయ‌ర్ స్ప‌ష్టం చేశారు. భ‌విష్య‌త్‌లో కోడ‌ర్స్‌ను ఏఐ రీప్లేస్ చేస్తుంద‌ని ఎన్‌విదియా సీఈవో జెన్సెన్ హువాంగ్ వెల్ల‌డించారు.

ఉద్యోగులు చేప‌ట్టే కోడింగ్‌, టెస్టింగ్, మెయింటెనెన్స్‌, ట్ర‌బుల్ టికెట్స్ రెస్పాండింగ్ స్కిల్స్‌ను ఏఐ చేప‌డుతుంద‌ని ఆపై ఈ నైపుణ్యాల‌న్నీ వాడుక‌లో లేనివిగా మార‌తాయ‌ని, ఫ‌లితంగా పెద్ద‌సంఖ్య‌లో లేఆఫ్స్ చూస్తామ‌ని నాయ‌ర్ హెచ్చ‌రించారు.

అయితే ఏఐతో లాభదాయ‌త‌ స‌హా అన్ని విభాగాల్లో మెరుగైన ఫ‌లితాలు ఉండ‌టంతో కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించ‌కుండా త‌మ‌తో కొన‌సాగించ‌డం మేలు చేస్తుంద‌ని నాయ‌ర్ పేర్కొన్నారు. భార‌త ఐటీ కంపెనీల‌కు ఏఐ అపార అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.


 

spot_img
spot_img
spot_img