Friday ,June 26, 2026, 3:33 am
Kuhu World
HomeBusiness1విశాఖ టూ బ్యాంకాక్‌.. ఇక నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

విశాఖ టూ బ్యాంకాక్‌.. ఇక నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

spot_img
spot_img

ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాంకాక్ వెళ్లే వారికి శుభవార్త. థాయ్‌లాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్ ఎయిర్‌ఏషియా విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభిస్తోంది.

విశాఖ నుంచి బ్యాంకాక్‌కి ఫ్లైట్ సర్వీస్‌లను ప్రారంభిస్తున్నట్లు థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ డైరెక్ట్ సర్వీస్‌లు ఉండబోతున్నట్లు పేర్కొంది.

వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

Fashion Ad1

ప్రస్తుతం విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు లేవు. కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ ద్వారా ప్రయాణించాల్సి ఉంది. ఇప్పుడు డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ అందుబాటులోకి వస్తుండటంతో ఇక్కడి నుంచి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


 

spot_img
spot_img
spot_img