ఓ వైపు వరి.. మరోవైపు ఉద్యాన పంటలు.. ఇంకో వైపు మెట్ట పంటల సాగుతో తిరుపతి జిల్లా సస్యశ్యామలంగా ఉంటుంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు పంటలను ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే ఉన్నాయి.
ఉద్యాన పంటలకు ఎప్పటి నుంచో ఊతమిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఈ దఫా బహు వార్షిక ఉద్యాన పంటలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
సాంప్రదాయ పంటలు సాగు చేసిన నష్టపోయిన రైతులు ఉద్యాన పంటల వైపు అడుగులు వేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఔత్సాహిక అన్నదాతలకు రాయితీలు అందించనున్నారు.
బడ్జెట్ మరియు రాయితీల వివరాలు :
తిరుపతి జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకంలో రూ. 14.59 కోట్ల మేర రాయితీలు రైతులకు అందించాలని ఉద్యాన వన శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
టిష్యూ కల్చర్ ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపితే.. రూ. కోటి నిధులైనా ఇచ్చేందుకు సిద్ధమని ఆ శాఖ ప్రకటించింది.
గరిష్టంగా రెండు హెక్టార్లకు వర్తింపు :
-
పంటల రకాలు: ఈ ఏడు ఉద్యాన పంటల సాగు చేసే రైతులు బహు వార్షిక పంటలు నాటేలా చూస్తారు. అందులో – మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, సపోటా – ఉన్నాయి.
-
రాయితీ పరిమితి: ఈ పంటలకు రైతులకు గరిష్టంగా రెండు హెక్టార్లకు రాయితీ వర్తింపజేస్తారు.
-
ఇతర పంటలు: రెండేళ్ల పాటు దిగుబడినిచ్చే – అరటి, బొప్పాయి – సాగుదారులకు సైతం చేయూత ఇవ్వనున్నారు.
మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం :
విపణిలో మంచి గిరాకీ ఉన్న – డ్రాగన్ ఫ్రూట్, అంజూరు, ఉసిరి, అల్ల నేరేడు తోటలపై – ఉత్సాహం చూపుతున్న వారికి తోడ్పాటు అందిస్తారు. కూరగాయలు, పూలు – పండిస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
– బాచి






