పూర్తిగా మారనున్న ఇరాన్ రాజకీయ ముఖచిత్రం !
(మార్చి.1st.2026)
ప్రస్తుతం ఇరాన్ లో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం.
“ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” (US) మరియు “ఆపరేషన్ రోరింగ్ లయన్” (Israel) ల ద్వారా ఇరాన్ లోని అత్యున్నత నాయకత్వాన్ని దెబ్బతీయడం వెనుక ఉన్న అసలు వ్యూహం – బహిష్కృత యువరాజు రెజా పహ్లావి (Reza Pahlavi) ను ఇరాన్ కు తిరిగి తీసుకు వచ్చి దేశ పరిపాలన పగ్గాలు అప్పగించడమే.
ఇరాన్ లో ‘పాలన మార్పు’ సాధ్యమేనా?
ఈ మార్పు కోసం ఎంతో కాలం గా ఎదురు చూస్తున్న Israel ప్రణాళికలు ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చేట్టుగా ఉంది.
అవును, ప్రస్తుతం అమెరికా మరియు ఇజ్రాయెల్ యొక్క ప్రధాన లక్ష్యం కేవలం ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడం మాత్రమే కాదు, అక్కడి ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనను పూర్తిగా మార్చేసి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం.
శనివారం దాడుల్లో అత్యున్నత నాయకుడు ఖమేనీ , అనేకమంది సీనియర్ కమాండర్ల మరణ వార్తల తో ఇరాన్ ప్రభుత్వం తీవ్రమైన అయోమయంలో పడింది.
అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఇరాన్ ప్రజలకు వీడియో సందేశం పంపి, “ఈ దేశం మీది, దీనిని మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం” అని పిలుపునిచ్చారు. లోపల ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తే పాలన మార్పు సులభం అవుతుంది అనే సూత్రం పై ఇజ్రాఏల్, అమెరికా చాలాకాలంగా వర్క్ చేస్తూ వచ్చాయి.
యువరాజు రెజా పహ్లావి తిరిగి రాగలరా?
1979 విప్లవానికి ముందు ఇరాన్ ను పాలించిన షా కుమారుడు రెజా పహ్లావి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఇరాన్ లోని యువతలో ఒక వర్గం ఆయన పట్ల సానుకూలంగా ఉంది. ఆయన ఇప్పటికే “ఇరాన్ ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్” (Iran’s Prosperity Project) పేరుతో ఒక ప్రజాస్వామ్య మార్పు ప్రణాళికను ప్రకటించారు.
ఆయన వెంటనే రాజుగా మారతారని చెప్పలేము కానీ, ఒక “ట్రాన్సిషన్ లీడర్” (మధ్యంతర నాయకుడు) గా ఇరాన్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆయనకు అమెరికా మరియు ఇజ్రాయెల్ ల నుండి పరోక్ష మద్దతు లభిస్తోంది.
ఆయన ఉద్దేశం ప్రకారం, ఒక 180 రోజుల అత్యవసర పాలన తర్వాత, ప్రజలందరికీ నచ్చేలా ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.