మహాదేవుని – పంచబ్రహ్మ స్వరూపం మరియు ప్రాముఖ్యత
పరబ్రహ్మము ఐదు ముఖాలతో (పంచబ్రహ్మలుగా) ప్రకాశిస్తుంటుంది.
అవి: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష మరియు ఈశాన. ఈ ఐదు ముఖాల ద్వారానే పరమేశ్వరుడు సృష్టి కార్యాకలాపాలను నిర్వహిస్తాడు.
ఈ మంత్రాల వెనుక “విశ్వ రహస్య విజ్ఞానం” (Universal Formation) దాగి ఉందని కొద్దిగా లోతైనస్టడీ చేసే శ్రద్దాళువలకు అర్ధం అవుతుంది.
ఉదాహరణకి ఇందులో ఒక పరి వామదేవ మంత్రం పరిశీలిస్తే పంచబ్రహ్మ తత్త్వం లోని ఒక భూమిక వైపు కాంతి ప్రసరిస్తుంది. అందులోని పదాల అర్ధాలు తెలుసుకుందాం..
- వామ (సృష్టి): తన నుండి సర్వ సృష్టిని వ్యక్తపరిచే శక్తి (సృష్టికర్త).
- జ్యేష్ట మరియు శ్రేష్ట (పాలన): లోకంలో గొప్పవాడై అందరినీ పాలించే స్థితికారక శక్తి (పాలనకర్త).
- రుద్ర (లయ): రుద్ర స్వరూపుడై లోకాన్ని ఉపసంహరించే శక్తి (లయకారుడు).
- కాల మరియు కలవికరణ (పరిణామం): సృష్టిలో ప్రతిదీ కాలానికి లోబడి ఉంటుంది. ఏ జీవికి ఏ కర్మఫలం ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయించే కాల స్వరూపం ఆయనది.
- బల, బలవికరణ మరియు బలప్రమధన (శక్తి నియంత్రణ): జీవులందరికీ బలాన్ని ఇచ్చేవాడు, ఆ బలాన్ని వెదజల్లేవాడు మరియు అవసరమైనప్పుడు ఆ బలాన్ని నియంత్రించేవాడు ఆయనే.
- సర్వభూత దమన (క్రమశిక్షణ): సృష్టిలోని సమస్త జీవులను తన నియంత్రణలో (Control) ఉంచే శక్తి.
- మనోన్మన (మోక్షం): సాధకుని యొక్క సంకల్ప రూపమైన మనసును ఉన్నత స్థితికి (ఉన్మనీ స్థితికి) తీసుకువెళ్లి ముక్తిని ప్రసాదించే స్థితి.
పంచబ్రహ్మ మంత్రాల యొక్క లోతైన అర్థం మరియు సృష్టి నిర్వహణలో వాటి పాత్ర గురించి తెలుసు కుంటున్నాం.
శివుడు ఎలా సృష్టిని తన వశంలో ఉంచుకుంటాడో (సర్వం వశీకృతం) ఈ మంత్రాలు రహస్యమైన అంతరార్ధాన్ని వివరిస్తున్నాయి.






