Saturday ,March 7, 2026, 4:55 pm
Kuhu World
Homeపద్మావతి అమ్మవారి - కార్తీక బ్రహ్మోత్సవాలు - 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

పద్మావతి అమ్మవారి – కార్తీక బ్రహ్మోత్సవాలు – 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

spot_img
spot_img

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 18 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 7న మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించనున్నారు.

ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా కుంకుమార్చన సేవ, బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Fashion Ad1

 

spot_img
spot_img
spot_img