Saturday ,March 7, 2026, 4:55 pm
Kuhu World
HomeBJP : BC CM అభ్యర్థిని - ప్రధాని మోదీ ప్రకటించనున్నారా ?

BJP : BC CM అభ్యర్థిని – ప్రధాని మోదీ ప్రకటించనున్నారా ?

spot_img
spot_img

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం మంగళవారం  మరోసారి హైదరాబాద్ వస్తున్నారు.

ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవసభలో పాల్గొననున్నారు.  తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని సీఎంను చేస్తామని ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు.

అందుకు బీసీలంతా అత్మగౌరవ సభను ఏర్పాటు చేసి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సభకు వస్తున్న ఆయన బీసీలకు చిరకాలం గుర్తుండిపోయే ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Fashion Ad1

బీసీలకు కొన్ని వరాలు ప్రకటించడంతో  పాటు తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ సీఎం ఎవరో కూడా ఆయన ప్రకటించే ఉందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించే సంప్రదాయం లేని బీజేపీ – కానీ తెలంగాణ ప్రత్యేకం ! 

బీజేపీ హైకమాండ్  ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించాలనే ఆలోచన చేయదు.

ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ పార్టీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా .. రాష్ట్రాల వారీగా వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలో తెలంగాణలో విజయం కోసం  పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.  అయితే అభ్యర్థి ఎవరు అన్నది స్పష్టత లేదు. తెలంగాణ బీజేపీ లో బీసీల్లో ఇప్పుడిప్పుడే రాష్ట్ర స్థాయి నాయకులు తయారవుతున్నారు.

ఆరెస్సెస్ నుంచి ఎదిగి.. రాష్ట్ర స్థాయి కి ఎదిగిన బండి సంజయ్, అలాగే కేసీఆర్ సహచరునిగా ఉండి ఆయననే సవాల్ చేస్తున్న ఈటల రాజేందర్ తో పాటు పలువురు బీసీ నేతలు ఉన్నారు.  అందుకే.. వీరిలో ఒకర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే.. ఎంతో మేలు జరుగుతుదంన్న అంచనాలతో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

 

spot_img
spot_img
spot_img