Saturday ,March 7, 2026, 6:38 pm
Kuhu World
Homeకవిత : అమృత‌మే తెలుగు

కవిత : అమృత‌మే తెలుగు

spot_img
spot_img

అమృత‌మే తెలుగు
అద్భుతంగా అంత‌టా సంభాషించు

అజ‌రామ‌రం తెలుగు
ఆత్మ‌బంధువువై ప‌రిర‌క్షించు

ప్రామాణిక రూప‌మే తెలుగు
అనుశీల‌త‌తో ప‌రిశోధించు

Fashion Ad1

అనుబంధాల వేగుచుక్క తెలుగు
విశాల‌త క‌లిగిన క్రియాశీలిగా భావించు

విజ్ఞానాల క‌దంబం తెలుగు
అజ్ఞాత శూన్యం తొల‌గింద‌ని గుర్తించు

సామాజిక చైత‌న్య స్వ‌రూపం తెలుగు
అస‌లైన మూల‌ధ‌నం అదేన‌ని ప్ర‌క‌టించు

పీడ‌న‌పై ఎలుగెత్తిన అక్ష‌ర బావుటా తెలుగు
సార్వ‌కాలిక య‌దార్థమ‌దేన‌ని వివ‌రించు

జ‌నామోద ప్ర‌తిబింబ‌మే తెలుగు
త‌ర‌త‌రాల‌కు ఆ శోభ‌ను విస్త‌రించు

వెలిగించు తెలుగును
విస్త‌రించు భాషాదీపిక‌ను

ప్ర‌సరించు కీర్తి చంద్రిక‌ల‌ను….

~ డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్


spot_img
spot_img
spot_img