Saturday ,March 7, 2026, 6:45 pm
Kuhu World
HomeUncategorizedపోలీసు కానిస్టేబుల్ పాత్ర లో విజయ్ దేవరకొండ ?

పోలీసు కానిస్టేబుల్ పాత్ర లో విజయ్ దేవరకొండ ?

spot_img
spot_img

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

VD12 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్ళిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది గ్యాంగ్‌ స్టార్‌ బ్యాక్‌డ్రాప్‌‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విజయ్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు లీకైంది.

గ్యాంగ్‌స్టార్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో విజయ్ దేవరకొండ ఓ పోలీసు కానిస్టేబుల్ పాత్రలో నటించనున్నారనేది ఫిల్మ్ లాండ్ లో టాక్.

Fashion Ad1

 

దీనికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

spot_img
spot_img
spot_img