సిద్ధార్థ్, నిమిషా సజయన్ (కేరళ ) .. ప్రధాన పాత్రల్లో ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం – చిత్తా. సిద్ధార్థ్ స్వయంగా నిర్మాత గా మారి .. నిర్మించిన ఈ చిత్రం ..సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధార్థ్ మరియు నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డ్రామా మరియు థ్రిల్లర్ జోనర్ ల కలబోత గా ఉండబోతుందని .. చిత్తా టీజర్ ను బట్టి తెలుస్తుంది.
సిద్ధార్థ్ చివరి చిత్రం, బాక్సాఫీస్ డిజాస్టర్ కావడంతో, చిత్తా ఎంతో ప్యాషన్ తో చేసినట్లు కనిపిస్తుంది. చిత్తా టీజర్ ప్రోమిసింగ్ గా ఉంది.
బాలాజీ సుబ్రమణ్యం కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ ఎ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ చిత్రానికి ధీబు నినాన్ థామస్ ట్రాక్స్ కంపోజ్ చేశారు.
సిద్ధార్థ్ ప్రస్తుతం .. S శంకర్ యొక్క – ‘భారతీయుడు 2’ – లో కూడా పని చేస్తున్నాడు.






