Saturday ,March 7, 2026, 6:39 pm
Kuhu World
HomeUncategorizedమళ్ళీ.. యాక్షన్ మోడ్ లోకి .. కమల్‌ హాసన్‌ - కొత్త సినిమా అప్‌డేట్‌

మళ్ళీ.. యాక్షన్ మోడ్ లోకి .. కమల్‌ హాసన్‌ – కొత్త సినిమా అప్‌డేట్‌

spot_img
spot_img

తీరన్ అధిగారం ఒండ్రు (తెలుగులో ఖాకి), నేర్కొండ పార్వై, వలిమై (Valimai), తునివు (Thunivu) చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు కోలీవుడ్‌ దర్శకుడు హెచ్‌. వినోద్‌.

ఆయ‌న దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి స్వయంగా కమల్‌హాసన్‌ కథను అందింస్తుండ‌గా.. రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇండియా.. నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

#KH233 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రోడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటుంది.

Fashion Ad1

తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.

భారీ యాక్షన్ నేపథ్యంలో రానున్న ఈ మూవీ కోసం కమల్‌హాసన్‌ ట్రెయినింగ్ సెషన్‌లో పాల్గొనుంటున్నట్లు మేకర్స్ ఒక వీడియో విడుదల చేశారు.

క‌మ‌ల్ గ‌న్ ప‌ట్టుకుని షూట్ చేస్తున్న‌ట్లు వీడియో ఉంది. కాగా ‘గ‌ట్స్ అండ్ గ‌న్స్’ (Guts And Guns) పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఆసక్తి రేకెత్తించేలా ఉంది.

ఇక ఈ సినిమాలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.


 

spot_img
spot_img
spot_img