Friday ,September 25, 2026, 12:43 pm
Kuhu World
HomeUncategorizedశ్రీలంక స్పిన్నర్ 'మురళీధరన్' బయోపిక్ - ‘800’ ట్రైలర్

శ్రీలంక స్పిన్నర్ ‘మురళీధరన్’ బయోపిక్ – ‘800’ ట్రైలర్

spot_img
spot_img

ముత్తయ్య మురళీధరన్ .. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. దేశంతో సంబంధం లేకుండా ఒక క్రికెటర్‌గా, అద్భుతమైన స్పిన్నర్‌గా మురళీధరన్‌ను ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఇష్టపడతారు.

అయితే, శ్రీలంకలో పుట్టిన ఒక తమిళ క్రికెటర్ అయిన మురళీధరన్ గురించి చాలా విషయాలు బయట ప్రపంచానికి తెలియదు. అలాంటి ఎన్నో తెలియని నిజాలను ఇప్పుడు ‘800’గా తెరపై ఆవిష్కరిస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘800’.


టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ మురళీధరన్. అందుకే ఆయన బయోపిక్‌కు ‘800’ అని టైటిల్ పెట్టారు.

Fashion Ad1

శ్రీలంకలో పుట్టిన ఒక తమిళ కుర్రాడు అక్కడి పరిస్థితిలను ఎదుర్కొని ఒక క్రికెటర్‌గా ఎలా ఎదిగాడు అనే ప్రధాన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ముత్తయ్య మురళీధరన్‌గా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. తమిళంలో రూపొందిన ఈ సినిమాను ఇతర భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు.


‘800’ మూవీ ట్రైలర్‌ను ఈరోజు ముంబైలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్‌లో ప్రతి సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

శ్రీలంకలో తమిళులకు, సింహళీలకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగేది. తమిళ అస్థిత్వాన్ని కాపడడానికి, తమిళ రాజ్యాన్ని ఏర్పాటుచేసుకోవడానికి ఎల్టీటీఈ ప్రభాకరన్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పోరాటం జరిగిన విషయం తెలిసిందే.

అలాంటి సమయంలో తమిళుడైన మురళీధరన్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ పరిస్థితులు అన్నింటినీ ‘800’లో చూపిస్తున్నారు దర్శకుడు ఎం.ఎస్.శ్రీపతి.  ట్రైలర్ ఆసక్తి కరంగా ఉంది మరియు సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది.

ఇక మురళీధరన్ పాత్రను ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ పోషించారు. నిజానికి ఈ పాత్రను ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి పోషించాల్సింది. ఆయన ఈ సినిమాను అంగీకరించి మేకోవర్ కూడా అయ్యారు.

కానీ, ఒక శ్రీలంక క్రికెటర్ పాత్రను తమిళ నటుడు చేయడానికి వీల్లేదని.. ఇది తమిళులను అవమానించడమే అంటూ తమిళనాడులో నిరసనలు జరగడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. కాగా, ఈ సినిమా అక్టోబర్ 6న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది.


spot_img
spot_img
spot_img