Saturday ,March 7, 2026, 8:30 pm
Kuhu World
HomeUncategorizedఫస్ట్ టైమ్ విలన్‌గా నటిస్తున్న - అనుష్క శెట్టి

ఫస్ట్ టైమ్ విలన్‌గా నటిస్తున్న – అనుష్క శెట్టి

spot_img
spot_img

తన 18 ఏళ్ల సినీ కెరియర్లో తెలుగు, తమిళ మినహా పరభాషల వైపు కన్నెత్తి కూడా చూడలేదు అనుష్క. అలాంటిది మొదటిసారి ఇప్పుడు మాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది.

‘కథనార్’ అనే పేరుతో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ హారర్ మూవీలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తుంది. యదార్ధ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ హారర్ మూవీలో మలయాళ హీరో జయసూర్య లీడ్ రోల్ చేస్తున్నాడు.

కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చి ఫాదర్ జీవితం నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. హారర్ అంశాలతో సరికొత్త బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ గ్లిమ్స్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

Fashion Ad1

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో అనుష్క ఏకంగా విలన్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తన కెరీర్ లోనే మొదటిసారి ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో అనుష్క నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రామానంద్ స్క్రిప్ట్ ను అందిస్తుండగా, గోకులం గోపాలన్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

రాహుల్ సుబ్రహ్మణ్యన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఫ్రాంచైజ్ గా ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఫస్ట్ పార్ట్ ని 2024లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు.

ఒకప్పుడు అనుష్క నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో మలయాళం నుంచి నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా మాలీవుడ్ సినిమాలు చేయనని చెప్పింది అనుష్క.

అటు బాలీవుడ్ లోనూ ‘సింగం’ సిరీస్ లో నటించే అవకాశం వచ్చినా కూడా ఆఫర్ ని కూడా తిరస్కరించింది.


 

spot_img
spot_img
spot_img