Saturday ,March 7, 2026, 8:47 pm
Kuhu World
HomeUncategorizedనట్స్ తో 'హెల్త్ బెనిఫిట్స్' తెలుసుకుందాం !

నట్స్ తో ‘హెల్త్ బెనిఫిట్స్’ తెలుసుకుందాం !

spot_img
spot_img

వాల్‌నట్స్, పైన్ నట్స్, బాదం, పీనట్, జీడీపప్పు, పిస్తా వంటి విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మంచి కొవ్వులు, ప్రోటీన్ శాతం అధికంగా ఉంటాయి. వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోండి.

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడానికి చాలా మందికి సమయం దొరకడం లేదు. ఉద్యోగరీత్యా వర్క్‌లోడ్ పెరిగిపోవడంతో ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి క్రానిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి.


ముఖ్యంగా పోషక విలువలు ఎక్కువగా ఉన్న నట్స్ డైట్‌లో చేర్చుకోవాలి. వాల్‌నట్స్, పైన్ నట్స్, బాదం, పీనట్, జీడీపప్పు, పిస్తా వంటి విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మంచి కొవ్వులు, ప్రోటీన్ శాతం అధికంగా ఉంటాయి. వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోండి.

Fashion Ad1

నట్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు తగ్గవచ్చు. శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో వీటి పాత్ర కీలకం. అంతేకాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కూడా తగ్గుతుంది.

ఖర్జూరా, సలాడ్, స్మూతీ, తాజా పండ్లకు నట్స్ జోడిస్తే రుచితో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వివిధ రకాల నట్స్ ఏవిధంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో పరిశీలిద్దాం.


* బాదం : బాదం పోషకాల గని. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని తరచుగా తింటే ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

బాదం పప్పులను పచ్చిగా లేదా ఫ్రై చేసుకొని తినవచ్చు. అయితే వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.


* వాల్‌నట్స్ : వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. దీంతో శరీరంలో జరిగే ఆక్సిడేషన్ స్ట్రెస్‌తో పోరాడటానికి అవసరమైన శక్తిని ఇవి అందిస్తాయి. జీర్ణక్రియను సైతం వాల్‌నట్స్ మెరుగుపరుస్తాయి.

ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతూ అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తాయి. వాల్‌నట్స్ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే వాటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినాలి.


* జీడిపప్పు : జీడిపప్పు మంచి పోషక విలువలున్న నట్. వీటిలో మంచి కొవ్వు, ప్రోటీన్, మాంగనీస్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. జీడిపప్పులో స్టెరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఎల్‌డీఎల్ లెవల్స్ తగ్గిస్తుంది.

డైట్‌లో వీటిని చేర్చుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గవచ్చు.

వీటిని పచ్చిగా తినవచ్చు. జీడిపప్పులను ముద్దగా చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు. ఎలా తిన్నా ప్రయోజనం ఉంటుంది.


* పీనట్ (వేరుశెనగ) : సాధారణంగా నట్స్ ఖరీదైనవి. అయితే వీటిలో పీనట్స్ మాత్రం తక్కువ ధరకే లభిస్తాయి. మంచి కొవ్వు, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, వివిధ రకాల విటమిన్స్, ఖనిజాలకు పీనట్స్ పవర్ హౌస్. వీటిలో యాంటీఆక్సిడెంట్ రెస్వెరాట్రాల్‌ ఉంటుంది.

ఇది శరీరంలో ఎనర్జీ స్థాయిలను పెంచుతుంది. పీనట్స్‌లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అలాగే క్యాన్సర్లు, అల్జీమర్స్ వంటి డీజెనరేటివ్ నరాల వ్యాధులతో పోరాడే శక్తి వీటికి ఉంటుంది. పీనట్స్‌ను రాత్రి నానబెట్టి మొలకెత్తిన తరువాత తింటే ప్రయోజనం బాగా ఉంటుంది.


* పిస్తా : పిస్తాపప్పుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండడంతో గుండె ఆరోగ్యంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

పిస్తాల్లో ఫైబర్స్, ఖనిజాలు తగిన మోతాదులో ఉంటాయి. దీంతో రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. రక్తపోటు అదుపులో ఉంచుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పిస్తాను తరచుగా డైట్‌లో చేర్చుకోవాలి.


 

spot_img
spot_img
spot_img