Friday ,June 26, 2026, 12:35 am
Kuhu World
HomeTopstories1‘ఆంధ్రప్రదేశ్‌ను మీ లాంచ్ ప్యాడ్‌గా ఉపయోగించుకోండి’ - రష్యా సంస్థలకు నారా లోకేష్ పిలుపు!

‘ఆంధ్రప్రదేశ్‌ను మీ లాంచ్ ప్యాడ్‌గా ఉపయోగించుకోండి’ – రష్యా సంస్థలకు నారా లోకేష్ పిలుపు!

spot_img
spot_img

సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా) :
భారతదేశ అంతరిక్ష రంగానికి గేట్‌వేగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రష్యా కంపెనీలు తమ లాంచ్ ప్యాడ్‌గా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
రష్యాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF 2026)’లో భాగంగా గురువారం నిర్వహించిన ‘భారత్-రష్యా బిజినెస్ డైలాగ్’లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఏపీలో అంతరిక్ష రంగం, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రణాళికలను లోకేష్ ప్రపంచ పెట్టుబడిదారుల ముందుంచారు.
4 బిలియన్ డాలర్ల స్పేస్ ఎకోసిస్టమ్.. ‘స్పేస్ పాలసీ 4.0’
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతరిక్ష రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ.. రాష్ట్రంలో 4 బిలియన్ డాలర్ల (దాదాపు ₹33,000 కోట్లు) భారీ పెట్టుబడులతో అంతరిక్ష ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని లోకేష్ ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా స్పేస్ పాలసీ 4.0’ (Space Policy 4.0) ను తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

“భారతదేశపు ఏకైక కార్యాచరణ అంతరిక్ష కేంద్రం (Spaceport) ‘సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ – శ్రీహరికోట’ మా ఆంధ్రప్రదేశ్ గడ్డపైనే ఉంది. ఈ నేల పైనుంచే 100కు పైగా అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగాయి.

అందుకే రష్యాకు చెందిన రోస్‌కోస్మోస్ (Roscosmos) సాంకేతిక భాగస్వాములు, శాటిలైట్ తయారీదారులు, స్పేస్-టెక్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ఒక సహజసిద్ధమైన మంచి అవకాశం  కానుంది.” అని లోకేశ్ అన్నారు.

తిరుపతిలో 3,000 ఎకరాల్లో ‘స్పేస్ సిటీ’
ఈ ప్రతిష్టాత్మక లక్ష్యంలో భాగంగా శ్రీహరికోటకు సమీపంలో తిరుపతి వేదికగా 3,000 ఎకరాల విస్తీర్ణంలో భారీ ‘స్పేస్ సిటీ’ (Tirupati Space City) ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
శాటిలైట్ల తయారీ, లాంచ్ వెహికల్ అసెంబ్లీ, ఏవియానిక్స్ ప్రొడక్షన్, డీప్-టెక్ ఇన్నోవేషన్ వంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలన్నింటికీ ఈ స్పేస్ సిటీ ఒక గ్లోబల్ హబ్‌గా మారుతుందని ఆయన వివరించారు.
అంతేకాకుండా, బెంగళూరుకు సమీపంలో ఉండేలా శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ భాగాలు, డ్రోన్లు, నావికాదళ వ్యవస్థలు, సెమీకండక్టర్ల తయారీ కోసం ప్రత్యేక అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆర్యభట్ట బంధం నుంచి నెక్స్ట్ ఆర్బిట్‌కు..
1975లో రష్యా సహకారంతో భారత్ ప్రయోగించిన మొదటి శాటిలైట్ ‘ఆర్యభట్ట’ నాటి నమ్మకాన్ని లోకేష్ గుర్తుచేశారు.
“భారత్-రష్యాల మధ్య దశాబ్దాల నాటి చారిత్రాత్మక బంధం ఇప్పుడు అంతరిక్ష రంగంలో ‘నెక్స్ట్ ఆర్బిట్’ (తదుపరి స్థాయి)కి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. రష్యా పారిశ్రామికవేత్తలు కేవలం పెట్టుబడిదారులుగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ వృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వాములుగా చేరాలి” అని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (Speed of Doing Business) విధానంతో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తోందని లోకేష్ స్పష్టం చేశారు.
ఈ ఫోరమ్ సందర్భంగా – అంతరిక్ష రంగంతో పాటు .. స్టీల్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గ్రీన్ ఎనర్జీ రంగాల్లోని – పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఏపీకి ఆహ్వానించారు.

బాచి
spot_img
spot_img
spot_img