Friday ,June 26, 2026, 12:31 am
Kuhu World
HomeSpecials1అమీర్ ఖాన్ కాబోయే భార్య ‘గౌరీ స్ప్రాట్’ ఎవరు? ఆమె ఆసక్తికర కుటుంబ నేపథ్యం ఇదే!

అమీర్ ఖాన్ కాబోయే భార్య ‘గౌరీ స్ప్రాట్’ ఎవరు? ఆమె ఆసక్తికర కుటుంబ నేపథ్యం ఇదే!

spot_img
spot_img

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీసుకున్న సరికొత్త నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
61 ఏళ్ల అమీర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొంతకాలంగా సహజీవనంలో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్( Gauri Spratt) ను జూలై 5న ముంబైలో వివాహం చేసుకోబోతున్నట్లు స్వయంగా ఆయనే అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ మనసు గెలుచుకున్న ఈ గౌరీ స్ప్రాట్ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనే విషయాలపై నెటిజన్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
భారత స్వాతంత్ర ఉద్యమంతో ముడిపడిన కుటుంబ చరిత్ర!
గౌరీ స్ప్రాట్ కేవలం ఒక బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు.. ఆమె కుటుంబానికి చారిత్రక నేపథ్యం ఉంది.
  • ఫ్రీడమ్ ఫైటర్ మనవరాలు : గౌరీ స్ప్రాట్.. ప్రముఖ బ్రిటిష్ కమ్యూనిస్ట్ మేధావి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఫిలిప్ స్ప్రాట్(Philip Spratt) మనవరాలు. బ్రిటన్‌లో జన్మించిన ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుని, 1920లలో కమ్యూనిస్టు ఉద్యమ కార్యకలాపాల కోసం భారతదేశానికి వచ్చారు. ఇక్కడి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత ఆయన భారతదేశంలోనే ఉండిపోయి స్థానిక మహిళను వివాహం చేసుకున్నారు.
  • మూడు సంస్కృతుల కలయిక: గౌరీ కుటుంబం విభిన్న సంస్కృతుల కలయికగా చెప్పవచ్చు. ఆమె తండ్రి వైపు తమిళ-బ్రిటిష్ వారసత్వం ఉండగా.. తల్లి వైపు పంజాబీ-ఐరిష్ మూలాలు ఉన్నాయి.
బెంగళూరులో బాల్యం.. లండన్‌లో చదువు!
  • బాల్యం & విద్య: గౌరీ స్ప్రాట్ (47) కర్ణాటకలోని బెంగళూరులో జన్మించి, అక్కడే పెరిగారు. ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లిన ఆమె.. లండన్‌లోని ప్రతిష్టాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్’ నుండి ఫ్యాషన్ అండ్ స్టైలింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
  • కెరీర్: చదువు పూర్తయ్యాక తిరిగి భారతదేశానికి వచ్చి వెల్‌నెస్, బ్యూటీ రంగంలో స్థిరపడ్డారు. బెంగళూరులోని ఒక ప్రముఖ సెలూన్ చైన్‌లో పనిచేసిన ఆమె, ఆ తర్వాత ముంబైలోని ప్రముఖ ‘బి బ్లంట్’ (BBlunt) సెలూన్ బాధ్యతలు చూసుకున్నారు. ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
  • వ్యక్తిగత జీవితం: గౌరీకి గతంలోనే వివాహం జరిగి విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఏడేళ్ల వయసున్న ‘క్విన్’ అనే కుమారుడు ఉన్నాడు.
అమీర్ ఖాన్‌ను ‘సూపర్‌స్టార్‌’గా చూడని గౌరి!
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గౌరీ స్ప్రాట్ బెంగళూరులో విభిన్న కళలు, ప్రాంతీయ సినిమాల వాతావరణంలో పెరగడం వల్ల ఆమెకు బాలీవుడ్ సినిమాలపై పెద్దగా అవగాహన లేదు. అమీర్ ఖాన్ నటించిన సినిమాల్లో ఆమె కేవలం ‘లగాన్’, ‘దిల్ చాహతా హై’ చిత్రాలను మాత్రమే చూశారట. అమీర్ ఖాన్‌ను ఒక సూపర్ స్టార్ లా కాకుండా కేవలం ఒక మంచి భాగస్వామిగా మాత్రమే చూస్తానని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అమీర్ ఖాన్ మాటల్లో:గౌరీ నా లైఫ్‌లోకి రావడం దేవుడిచ్చిన వరం. ఆమెతో ఉంటే నా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నిజానికి మా ఇద్దరికీ 25 ఏళ్లుగా పరిచయం ఉంది.
కానీ ఏడాదిన్నర క్రితం నా కజిన్ నుజ్రత్ ఖాన్ ద్వారా బెంగళూరులో అనుకోకుండా మళ్లీ కలిశాం. అది కాస్తా స్నేహంగా మారి, ప్రేమగా రూపాంతరం చెందింది.
ఇప్పటికే మానసికంగా నేను ఆమెను నా భార్యగా స్వీకరించాను. జూలై 5న అత్యంత సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ ద్వారా చట్టబద్ధంగా ఒక్కటి కాబోతున్నాం” అని అమీర్ తెలిపారు.

బాచి

spot_img
spot_img
spot_img