HomeEntertainment1బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యూ ట్యూబర్స్ - స్టార్ వార్స్‌ను దాటేసిన 'బ్యాక్ రూమ్స్'!
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యూ ట్యూబర్స్ – స్టార్ వార్స్‌ను దాటేసిన ‘బ్యాక్ రూమ్స్’!
హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనం నమోదైంది. ప్రముఖ స్వతంత్ర నిర్మాణ సంస్థ ‘A24’ బ్యానర్‌లో 20 ఏళ్ల యూట్యూబర్ కేన్ పార్సన్స్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ హర్రర్ చిత్రం ‘బ్యాక్ రూమ్స్’ (Backrooms) బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది.
కేవలం $10 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఓపెనింగ్ వీకెండ్‌లోనే ఏకంగా $81.4 మిలియన్లు రాబట్టింది.
డిస్నీ సంస్థ భారీ బడ్జెట్‌తో తెచ్చిన ‘స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు’ ($81.6 మిలియన్లు) చిత్రానికి ఇది గట్టి పోటీ ఇస్తూ, 2026 నాన్-సీక్వెల్ హర్రర్ చిత్రాలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది.