Saturday ,March 7, 2026, 9:43 am
Kuhu World
HomeSpecials1మంగళవారము - మార్చి 03 నాటి - చంద్ర గ్రహణ వివరణ

మంగళవారము – మార్చి 03 నాటి – చంద్ర గ్రహణ వివరణ

spot_img
spot_img

చంద్ర గ్రహణం

ఈ సం|| ఫాల్గుణ శుక్ల పూర్ణిమ – మంగళవారము 03.03.2026 నాడు – సింహరాశిలో – పూర్వఫల్గునీ – నక్షత్రమున కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.
స్పర్శ కాలం పగలు 03:20 pm – నుండి మోక్ష కాలం రాత్రి 06:47
సూర్యాస్తమయం (హైదరాబాద్) సాయం 06:20
మొత్తం పుణ్యకాలం 00:27 నిముషాలు.

గ్రహణ ఆరంభము ప గం. 03:20 అయినను – పుణ్యకాలము మాత్రం సూర్యాస్తమయము నుండి ప్రారంభమగును.
భారతదేశంలో – చంద్రుడు ఉదయించినప్పటి నుండి సాయంత్రం 6:48 వరకు మాత్రమే – గ్రహణాన్ని చూడగలం.

ప్రాంతీయ సమయలు మార్పు ఉంటాయి – గ్రహణ సమయాలు (భారత కాలమానం ప్రకారం)
గ్రహణం ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM (భారత్‌లో కనిపించదు)
సంపూర్ణ స్థితి (Totality) ప్రారంభం : సాయంత్రం 4:34 PM
సంపూర్ణ స్థితి ముగింపు: సాయంత్రం 5:33 PM
గ్రహణం పూర్తిగా ముగిసే సమయం సాయంత్రం 6:48 PM
వివిధ నగరాల్లో చంద్రోదయ సమయాలు – మార్చి 3, 2026
హైదరాబాద్ – 6:22 PM – 26 నిమిషాలు
విజయవాడ – 6:14 PM – 34 నిమిషాలు
విశాఖపట్నం – 6:02 PM – 46 నిమిషాలు

నిత్య భోజన సమయం
గ్రస్తోదయే విధోః పూర్వం నాహర్భోజన మాచరేత్ । గ్రస్తోదయే భవేదిన్దోః దివా శ్రాద్ధం న కారయేత్ | రాత్రావపి తదా కుర్యాత్ ప్రత్యబ్దం మను రబ్రవీత్ ||
ఈరోజు పగలు ఏ రకమైన ఆహారాదులు తీసుకొనకూడదు. శుద్ధ మోక్షానన్తరము (రాత్రి 06:47 తరువాత) నిత్యభోజనo చేయవచ్చు.
అశక్తులు (పిల్లలు, రోగగ్రస్థులు, గర్భిణులు, వృద్ధులు) ఈనాడు పగలు గం.11:00 లోపు భుజింప వచ్చును.

– రాళ్ళబండి శర్మ 

 

 

 

spot_img
spot_img
spot_img