HomeSpecials1పశు పోషణకు ఆర్థిక భరోసా - 'పశు కిసాన్' క్రెడిట్ కార్డులు
పశు పోషణకు ఆర్థిక భరోసా – ‘పశు కిసాన్’ క్రెడిట్ కార్డులు
పశుసంవర్ధక శాఖ ద్వారా అందుతున్న ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి
పథకం ఉద్దేశం
పశు పోషణ ఖర్చులు (దాణా, మేత, మందులు) రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చిన్న, మధ్య తరహా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
‘పశు కిసాన్’ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందుతుంది.
రుణ వివరాలు
-
గరిష్ట రుణం: పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణం పొందవచ్చు.
-
పూచీకత్తు లేకుండా: రూ. 1.60 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు.
-
వడ్డీ రేటు: రుణాన్ని 40 రోజుల్లో తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ ఉండదు.
-
రాయితీ: ఏడాదిలోపు క్రమం తప్పకుండా రుణాన్ని చెల్లిస్తే – ఆర్‌బీఐ, నాబార్డు నుంచి 3 శాతం, – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరో 3 శాతం చొప్పున – మొత్తం 6 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
ఆ తర్వాత కేవలం 7 శాతం వడ్డీ మాత్రమే విధిస్తారు.
దరఖాస్తు విధానం
-
అవసరమైన పత్రాలు: పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ నకళ్లు (జిరాక్స్) సమర్పించాలి.
-
ఎక్కడ దరఖాస్తు చేయాలి: సమీపంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో దరఖాస్తులను సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారి చెన్నయ్య తెలిపారు.