Saturday ,March 7, 2026, 11:47 am
Kuhu World
HomeLatest1పెదవడ్లపూడి ఎత్తిపోతలతో తీరిన రైతుల ఇక్కట్లు - మంత్రి లోకేష్ చొరవ

పెదవడ్లపూడి ఎత్తిపోతలతో తీరిన రైతుల ఇక్కట్లు – మంత్రి లోకేష్ చొరవ

spot_img
spot_img

దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించింది. మంత్రి లోకేష్ చొరవతో 27 వేల ఎకరాల ఆయకట్టుకు ఇప్పుడు సాగునీరు అందుతోంది.
కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వ నుంచి పెదవడ్లపూడి వద్ద ఈ హైలెవల్ ఛానల్ ఏర్పాటు చేశారు.
మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి గ్రామీణ, చేబ్రోలు, పెదకాకాని, గుంటూరు గ్రామీణ మండలాల్లోని 27,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం రూ. 15 కోట్లతో ప్రతిపాదన చేయగా, రూ. 14 కోట్లు ఖర్చు చేశాక పనులు నిలిచిపోయాయి. తర్వాతి ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ దీనిని ప్రాధాన్యతగా తీసుకుని రూ. కోటికి పైగా నిధులు విడుదల చేయించడంతో ప్రాజెక్టు పూర్తయింది.
“ఏటా ఖరీఫ్‌లోనే సాగునీటికి ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు రబీలోనూ కాలువల్లో నీరు కనిపిస్తోంది” అని కొండూరుకు చెందిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

spot_img
spot_img
spot_img