గరళకంఠుడు వీడు ..
హాలాహలాన్ని అమాంతం కంఠాన మ్రింగి జగతిని జాగ్రత్త చేసినవాడు !
శివా మమ్మేల రావా !
ఆద్యంతరహితుడు వీడు ..
శరణన్నవాడిని అందలాలకెక్కిస్తాడు !
శివా మమ్మేల రావా !
గంగేశ్వరుడు వీడు ..
భువిలోని దీనజనుల దాహార్తి తీర్చుటకై గంగను పంచివ్వగలడు !
శివా మమ్మేల రావా !
బోళాశంకరుడు వీడు ..
భోగాలన్నీ భక్తులకు ప్రసాదించి తానుమాత్రం నిరాడంబరంగా నిల్చునేవాడు !
శివా మమ్మేల రావా !
అర్ధనారీశ్వరుడు వీడు ..
ఆలికి తనలో సగభాగమిచ్చి కుటుంబ వ్యవస్థకు వెలుగుదారి చూపినవాడు !
శివా మమ్మేల రావా !
శుద్ధాత్మకుడు వీడు ..
ఆడంబరాలు అంతులేని సంపదలు అశాశ్వతమని లోకానికి చాటినవాడు !
శివా మమ్మేల రావా !
త్రినేత్రుడు వీడు ..
లోకాలనేలే అరాచకాలు అన్యాయాలు అకృత్యాలను మూడో నేత్రంతో భస్మీపటలం చేసే లోకరక్షకుడు !
శివా మమ్మేల రావా !
బూడిదే ఆభరణంగా భాసిల్లేవాడు ..
భవబంధాల మాయలో కొట్టుకుపోతున్నవారిని మోక్షమనే ఒడ్డుకు చేర్చేవాడు !
శివా మమ్మేల రావా !
మహాశివరాత్రి శుభాకాంక్షలు మానవశ్రేష్ఠా ..
ఈశ్వరానుగ్రహముతో మీ ఇల్లు ఇలలో వెలుగులీనుగాక !
~ ప్రణామాలతో, మీ,
శ్రీనివాస్ గుర్రం, చెరకుపల్లి, గుంటూరు జి.






