Wednesday ,April 16, 2025, 2:20 am
Kuhu World
HomeTopstories2అమరావతికి హైదరాబాద్‌ మార్గంలో - ఐకానిక్ బ్రిడ్జి

అమరావతికి హైదరాబాద్‌ మార్గంలో – ఐకానిక్ బ్రిడ్జి

spot_img

విజయవాడ-హైదరాబాద్ మార్గంలో మూలపాడు నుండి అమరావతికి గ్రాండ్ ఎంట్రెన్స్ వే నిర్మించాలని AP Govt ప్లాన్ చేస్తోంది.

గతంలో ఇబ్రహీంపట్నం దగ్గరలోని పవిత్ర సంగమం దగ్గర ఐకానిక్ బ్రిడ్జి కోసం భూమి పూజ చేశారు. ఈ వేను నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 30లను కనెక్ట్ చేయాలని అనుకున్నారు. 2016లో ఈ ప్రతిపాదన చేసిన సమయంలో విజయవాడ వెస్ట్ బైపాస్ లేదు. ఆ తరువాత గొల్లపూడి నుంచి సూరాయపాలెం మీదుగా కృష్ణా నదిపై 3 కిలోమీటర్ల పొడవునా విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మించారు. ఇది అమరావతి రాజధానిలో వెంకటపాలెం మీదుగా కాజా వరకు వెళ్తుంది.


గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు దగ్గరగా ఉండటంతో ఐకానిక్ బ్రిడ్జిని అక్కడ నిర్మించడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఏడీసీ అధికారులు కొత్త అలైన్‌మెంట్‌పై దృష్టి పెట్టారు.

ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మూలపాడు దగ్గర నుండి NH-65ను కలుపుతూ గ్రాండ్ ఎంట్రెన్స్ వే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఈ గ్రాండ్ ఎంట్రెన్స్ వే నుంచి ఐకానిక్ బ్రిడ్జిని కృష్ణా నదిపై నిర్మిస్తారు.


మూలపాడు నుండి కృష్ణా నది మీదుగా రాయపూడి వరకు 5.2 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తారు.

అమరావతి రాజధానిలో శాఖమూరు నుండి రాయపూడి వరకు ఎన్-13 రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ గ్రాండ్ ఎంట్రెన్స్ మార్గాన్ని రాయపూడి దగ్గర ఎన్-13 రోడ్డుకు కలపడం ద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం అవుతుంది.

అమరావతి గ్రాండ్ ఎంట్రెన్స్ మార్గంలో కృష్ణా నదిపై 4 కిలోమీటర్ల మేర ఐకానిక్ బ్రిడ్జి ఉంటుంది.


ఈ మేరకు రెండు రోజుల క్రితం ఏడీసీ అధికారులు ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన డీపీఆర్ తయారు చేయడానికి కన్సల్టెంట్‌కు టెండర్లు పిలిచారు.

మూలపాడు దగ్గర NH-65కు అనుసంధానం చేయడం ద్వారా హైదరాబాద్ రూట్‌లో ఈ మార్గం గేట్‌వేగా మారుతుంది అంటున్నారు. ఈ మార్గం హైదరాబాద్ నుంచి వచ్చే వారికి అమరావతికి స్వాగతం పలికే ద్వారంలా ఉంటుందని అర్థం.


 

spot_img
spot_img