Wednesday ,April 16, 2025, 1:12 am
Kuhu World
HomeSpecials1భారత్ లో టాటాల వ్యాపారం ఎలా మొదలయింది ? కుటుంబ పరంపర ?

భారత్ లో టాటాల వ్యాపారం ఎలా మొదలయింది ? కుటుంబ పరంపర ?

spot_img


దివికేగిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఒక్క వ్యాపారవేత్తగానే కాకుండా – విలువలు తో కూడిన ఆయన వ్యక్తిత్వం, నిరాడంబరత, సేవతత్పర తో – అన్ని వర్గాల ప్రజల నుండి గౌరవం, మన్ననలను పొందగలిగారు.

ఆయన తెలివితేటలు, కృషి పట్టుదలతో టాటా గ్రూప్‌ ను ప్రపంచస్థాయి వ్యాపార సంస్థగా మార్చారు. సామాన్యుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వారి మనస్సులో చెరగని ముద్రవేసుకున్నారు.

ఇంతటి ఘనత సాధించిన రతన్ టాటా కుటుంబం గురించి చాలా కొద్దిమందికే తెలిసి ఉంటుంది.

రతన్ టాటా మినహా మిగిలిన వారంతా చాలా సింపుల్‌గా వారి విషయాలు ఎవరికి తెలియకుండానే జీవిస్తుంటారు. కానీ రతన్ టాటా ఫ్యామిలీ అంత చిన్నదేమీ కాదు. చాలా పెద్దది.

రతన్ టాటా తండ్రి పేరు నావెల్ టాటా. ఆయనను రతన్‌జీ టాటా దత్తత తీసుకున్నారు. టాటా గ్రూప్ సంస్థలు స్థాపించిన జెమ్‌షెడ్‌జీ టాటా కుమారుడే ఈ రతన్‌జీ టాటా.


నసర్వాన్‌జీ టాటా

నసర్వాన్‌జీ టాటాను టాటా కుటుంబానికి మూలపురుషుడిగా చెబుతారు.  టాటా వంశం ఆయన నుంచే ప్రారంభమవుతుందని చెబుతారు.

నసర్వాన్‌జీ టాటా ఒక పార్సీ పూజారి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మొదటి సభ్యుడు కూడా ఆయనే. అక్కడి నుంచే టాటా కుటుంబం వ్యాపారం మొదలైంది.


జంషెడ్‌జీ టాటా 

నసర్వాన్‌జీ టాటా కుమారుడే జంషెడ్‌జీ టాటా. ఆయనే టాటా గ్రూప్‌ను  స్థాపించారు.

గుజరాత్‌లోని నవ్‌సారిలో ఉండే జంషెడ్‌జీ ముంబై రావడంతో దశ తిరిగింది. 1868లో టాటా గ్రూప్‌ను ఓ ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ చేశారు.

29 ఏళ్ల వయస్సులో 21,000 రూపాయల పెట్టుబడితో ఈ కంపెనీ ప్రారంభించారు.

తర్వాత టాటా గ్రూప్ షిప్పింగ్‌లో అడుగు పెట్టింది. 1869 నాటికి వస్త్ర వ్యాపారంలోకి కూడా కాలుమోపారు.

ఇలా ఒక్కొక్క వ్యాపారం ప్రారంభించి పెద్ద జంషెడ్జీని భారతీయ పరిశ్రమ పితామహుడిగా పిలుస్తారు. స్టీల్, హోటల్ (తాజ్ మహల్ హోటల్), హైడ్రోపవర్ ఇలా చాలా కంపెనీలను స్టార్ట్ చేశారు.


దొరాబ్జీ టాటా

జంషెడ్జీ టాటా పెద్ద కుమారుడే దొరాబ్జీ టాటా. టాటా స్టీల్, టాటా పవర్ వంటి కంపెనీల ఏర్పాటు ప్రగతిలో కీలక పాత్ర పోషించారు. జంషెడ్జీ తర్వాత టాటా గ్రూప్‌కు సారథ్యం వహించారు.


రతన్ జీ టాటా

దొరాబ్జీ, జంషెడ్జీ సోదరుడే రతన్‌జీ టాటా. వస్త్ర వ్యాపారాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. వాటితోపాటు టాటా గ్రూప్‌లోని ఇతర వ్యాపారాల  అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.


JRD టాటా

రతన్‌జీ టాటా కుమారుడు JRD టాటా. పూర్తి పేరు జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా.

JRD టాటా తల్లి ఫ్రెంచ్ మహిళ. ఆమె పేరు సుజానే బ్రియర్.

RD టాటా భారతదేశపు మొదటి కమర్షియల్ పైలెట్‌గా కుర్తింపు పొందారు. JRD టాటా 50 సంవత్సరాలకుపైగా (1938-1991) టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు.

పైలెట్ అయిన JRD టాటా విమానయాన సంస్థలు స్థాపించారు. తర్వాత దానిని ప్రభుత్వం జాతీయం చేసుకొని ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు.

ఇప్పుడు మళ్లీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా వాల్లే కొనుకున్నారు. టాటా గ్రూప్‌ను మల్టీ నేషనల్ కంపెనీగా మార్చడంలో JRD టాటా పాత్ర చాలా ముఖ్యమైంది.


నావల్ టాటా

రతన్‌జీ టాటా దత్తపుత్రుడే నావల్ టాటా.

టాటా గ్రూప్‌నకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. టాటా గ్రూప్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.


రతన్ నావల్ టాటా

రతన్ టాటా 8 డిసెంబర్ 1937న జన్మించారు. తండ్రి పేరు నావల్ టాటా తల్లి పేరు సునీ టాటా.

1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా పని చేశారు.

2017 నుంచి టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్ట్‌ అధిపతిగా ఉన్నారు. రతన్ టాటా టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చింది ఈయనే. JRD టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు.

ఫోర్డ్ లగ్జరీ కార్ బ్రాండ్లు ల్యాండ్ రోవర్, జాగ్వార్‌ను టాటా అకౌంట్‌లో వేయడంలో రతన్ టాటాదే ప్రధాన పాత్ర.

2008లో రతన్ టాటాకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. 2000లో పద్మభూషణ్‌ వరించింది.


జిమ్మీ టాటా

జిమ్మీ టాటా రతన్ టాటా సవతి సోదరుడు.

ఆయన కూడా బ్రహ్మచారి. ఆయన ఎప్పుడూ మిడియాకు దూరంగా ఉంటారు. జిమ్మీ టాటా కూడా వివిధ టాటా సంస్థల్లో పని చేసి 90వ దశకంలో పదవీ విరమణ చేశారు.

టాటా సన్స్, అనేక ఇతర టాటా కంపెనీల్లో వాటాదారుగా ఉన్నారు. ఆయన మొబైల్ ఫోన్‌ వాడరట. వార్తాపత్రికలు చదివి మాత్రమే అప్‌డేట్ అవుతుంటారు.


నోయెల్ టాటా

నోయల్ టాటా రతన్ టాటాకు సవతి సోదరుడు. నోయెల్ టాటా 1957లో జన్మించారు. అతను టాటా ఇంటర్నేషనల్ చైర్మన్ ఇతర టాటా గ్రూప్ కంపెనీల్లో భాగస్వామి కూడా.


రతన్ టాటా తర్వాత ఎవరు?

నోయెల్ టాటా ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు.

వీళ్లకు నెవిల్లే, లియా, మాయా టాటా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కిర్లోస్కర్ గ్రూప్ సభ్యురాలు మానసి కిర్లోస్కర్‌ను నెవిల్ వివాహం చేసుకున్నారు.

వీళ్లంతా టాటా గ్రూప్ వ్యాపారాల్లో పని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లలో ఎవరు టాటా గ్రూప్‌ బాధ్యతలు తీసుకుంటారు వారసులు ఎవరనే చర్చ జరుగుతోంది.


 

spot_img
spot_img