సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌ను వరించింది.
మానవ జీవితంలోని దుర్బలత్వంతోపాటు చారిత్రక విషాదాలను ఆమె.. తన రచనల్లో కళ్లకు కట్టారని రాయల్ స్వీడిష్ అకాడమి గురువారం వెల్లడించింది.
వైద్య, భౌతిక, రసాయనశాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే వెల్లడించారు.
నేడు సాహిత్యంలో విజేతను ప్రకటించగా.. శుక్రవారం నాడు నోబెల్ శాంతి బహుమతి , అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.