Wednesday ,April 16, 2025, 1:06 am
Kuhu World
HomeLatest1IAS : ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ లు ఆంధ్రాకు రానున్నారా ?

IAS : ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ లు ఆంధ్రాకు రానున్నారా ?

spot_img

తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ ల‌కు కేంద్ర షాక్ ఇచ్చింది.. వెంటనే ఎపిలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది.

ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారుల పేరిట లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం పంపించింది. దీంతో వారిని త‌ప్ప‌క తెలంగాణ నుంచి రిలీవ్ చేయాల్సిన ప‌రిస్థితి.

ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు తెలంగాణ‌లో అతికీల‌క పోస్ట్ ల‌లో బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్ గా ఆమ్ర‌పాలి , ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీ రొనాల్డ్ రోస్ లు విధులు నిర్వ‌హిస్తున్నారు.


కాగా , తెలంగాణలోనే కొనసాగించాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులను రాష్ట్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పింది.

ఏపీలో రిపోర్ట్ చేసే ఐఏఎస్‌ల జాబితాలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీ రొనాల్డ్ రోస్‌ లతో పాటు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ప్రశాంతిలతో పాటు ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాషలు ఉన్నారు.


 

spot_img
spot_img