మధుమేహ వ్యాధిగ్రస్తులైనా, హృద్రోగులైనా సరే – రోజుకు ఒక పూట ఉపవాసం చేస్తే మధుమేహం నియంత్రణలో ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది.
ప్రతి 10 గంటలకు ఒకసారి తింటే.. జీవక్రియ మెరుగుపడుతుందని తేలింది.
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని, కొలెస్ట్రాల్ తగ్గుతుందని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్‌డియాగో, సాల్క్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.
మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 108 మందిని పరీక్షించగా మెరుగైన ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు తెలిపారు.