Wednesday ,April 16, 2025, 1:40 am
Kuhu World
HomeSpecials1Oct 3 నుండి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Oct 3 నుండి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

spot_img

అయిగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే

గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే  !


విజయవాడ ఇంద్రకీలాద్రిపై – అక్టోబరు 3 నుంచి 12 వరకు – అమ్మవారి దసరా ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ ఉత్స‌వాల ఏర్పాట్లపై కలెక్టర్‌, సీపీ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యే సుజనాచౌదరి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు.

అలాగే, మూలా నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


(File Photo)


మూడు ఉచిత లైన్లు, రెండు టిక్కెట్‌పై దర్శించుకునే లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

భక్తులకు టిక్కెట్లను ఆన్‌లైన్‌ సహా ఘాట్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్‌లోనూ విక్రయించనున్నారు.

కనకదుర్గానగర్‌లో అన్నప్రసాదం స్వీకరణ, ప్రసాదాల కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. భక్తులకు ఉచిత ప్రసాదంగా – పులిహోర, కట్టెపొంగలి, దద్దోజనం, సాంబారు అన్నం – అందించనున్నారు.

ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలంకారాల వివ‌రాలు


అక్టోబర్‌ 3 (గురువారం) – బాలా త్రిపురసుందరిదేవి
అక్టోబరు 4 (శుక్రవారం) – గాయత్రీ దేవి
అక్టోబరు 5 – అన్నపూర్ణ దేవి
అక్టోబరు 6 (ఆదివారం) – లలిత త్రిపుర సుందరి దేవి
అక్టోబరు 7 – మహాచండీ దేవి
అక్టోబరు 8 – శ్రీమహలక్ష్మి దేవి
అక్టోబరు 9 (బుధవారం) – సరస్వతి దేవి (మూలా నక్షత్రం)
అక్టోబరు 10 (గురువారం) – దుర్గాదేవి
అక్టోబరు 11 (శుక్రవారం) – మహిషాసుర మర్దిని
అక్టోబరు 12 – శ్రీ రాజరాజేశ్వరిదేవి


** ఇదిలా ఉండగా తెలంగాణ (పాఠశాల విద్యా శాఖ) పాఠశాలలకు – Oct 2 నుండి Oct 14 వరకు – దసరా సెలవులు ఉంటాయని ఈ రోజు కన్ఫర్మ్ చేసింది. మొత్తం 13 రోజులు సెలవులు.

Oct 15న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.


 

spot_img
spot_img