Wednesday ,April 16, 2025, 2:57 am
Kuhu World
HomeAsia1Singapore NRI : గోనె నరేందర్ రెడ్డి సేవలు మరువలేనివి

Singapore NRI : గోనె నరేందర్ రెడ్డి సేవలు మరువలేనివి

spot_img

తెలంగాణ కల్చరల్ సొసైటీ (Singapore) ఉపాధ్యక్షుడు గోనె నరేందర్ రెడ్డి, 11 సెప్టెంబర్ 2024 న తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందారు.

నరేందర్‌ రెడ్డి మృతితో తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆయన చేసిన సేవలను తలుచుకొని బాదాతప్త హృదయంతో నివాళులు అర్పించారు.

NRI | గోనె నరేందర్ రెడ్డి సేవలు మరువలేనివి

వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఆయన మృతదేహాన్ని ఇండియాకు తరలించి కర్మకాండలు జరిపించేందుకు సొసైటీ తరఫున పూర్తి సహాయ సహాకారాలు అందజేస్తామన్నారు.


జగిత్యాల జిల్లా కొత్తపేట్ మండలం వెల్గటూర్‌కు చెందిన గోనె నరేందర్ గత 25 సంవత్సరాల నుంచి సింగపూర్‌లో ఉంటున్నారు.

ప్రస్తుతం తన కుటుంబతో సహా శాశ్వత నివాస హోదాలో సింగపూర్‌లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.


 

spot_img
spot_img