Wednesday ,April 16, 2025, 1:28 am
Kuhu World
HomeFeatures1Lifestyleచాయ్‌ వల్ల చురుకుదనం కలిగినా.. సమస్యలూ ఉన్నాయ్‌

చాయ్‌ వల్ల చురుకుదనం కలిగినా.. సమస్యలూ ఉన్నాయ్‌

spot_img

బ్రిటిష్‌ పాలకులు అలవాటు చేసిన పానీయం తేనీరు. తెల్లవారిని తరిమికొట్టినా, చాయ్‌ని మాత్రం వదులు కోలేకపోతున్నాం. ఉదయాన్నే ఓ కప్పు పడందే చాలామందికి దినచర్య మొదలు కాదు. టీలోని కెఫిన్‌, యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల చురుకుదనం కలిగినా.. కొన్ని సమస్యలంటూ ఉంటాయి..


  • ఖాళీ కడుపుతో చాయ్‌ తాగితే.. ఆ ద్రవ పదార్థం పొట్టలో ఆమ్ల (ఎసిడిక్‌), క్షార (ఆల్కలిన్‌) రసాయనాల సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది.
  • టీ కి డైయురెటిక్‌ లక్షణం ఉంది. అంటే, మూత్రం వచ్చే అవకాశం ఎక్కువ. అసలే రాత్రంతా డీహైడ్రేట్‌ అయిన శరీరం, టీ తాగాక మరింత తేమను కోల్పోవచ్చు. దీనివల్ల కండరాలు పట్టేయవచ్చు. అలా క్రాంప్స్‌కు దారితీస్తుంది.
  • టీ అంటే మూడొంతులు పాలే! పాలలోని లాక్టోజ్‌ అంత తేలికగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపుబ్బరం,
    మలబద్ధకం, గ్యాస్‌ లాంటి సమస్యలు వస్తాయి.
  • వేడివేడిగా తాగితే పంటి పైపొర దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.
  • టీ లోని కెఫిన్‌ ఖాళీ కడుపులోకి చేరడం వల్ల కళ్లు తిరగడం, వికారం లాంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. అందుకే ఉదయం అల్పాహారం తీసు కున్నాకో, కనీసం మంచినీళ్లు తాగిన తర్వాతో చాయ్‌ కప్పు అందుకోవడం మంచిదని సలహా ఇస్తారు నిపుణులు.

 

spot_img
spot_img