Wednesday ,April 16, 2025, 2:25 am
Kuhu World
HomeBusiness2మర్చంట్స్ వద్ద జియో పేమెంట్స్ సౌండ్ బాక్స్ - త్వరలో ప్రారంభం..?!

మర్చంట్స్ వద్ద జియో పేమెంట్స్ సౌండ్ బాక్స్ – త్వరలో ప్రారంభం..?!

spot_img

ఇప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ చెల్లింపులే.. యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రతి పేమెంట్ కూడా యూపీఐ ఆధారిత మొబైల్ యాప్స్ లోనే సాగిపోతున్నాయి.

చెల్లింపుల సంగతి తెలుసుకోవడానికి మొబైల్ యాప్స్ సౌండ్ బాక్స్‌లు తీసుకొచ్చాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ మీద ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో ‘స్మార్ట్ స్పీకర్’ తేనున్నట్లు గూగుల్ పే తెలిపింది. ఆ బాటలోనే రిలయన్స్ అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ సౌండ్ బాక్స్ తీసుకు రానున్నది.


డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో తన పట్టు పెంచుకునేందుకు జియో పేమెంట్స్ ‘జియో పే’ యాప్ నిర్వహిస్తున్నది.

తాజాగా సౌండ్ బాక్స్ టెక్నాలజీతో తన వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది. తొలుత జైపూర్, ఇండోర్, లక్నో వంటి నగరాల్లోని రిలయన్స్ రిటైల్ స్టోర్లలో వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. అటుపై రిలయన్స్ రిటైల్ స్టోర్లలో టెస్ట్ చేసిన తర్వాత పూర్తిస్థాయిలో కస్టమర్లందరికీ అందుబాటులోకి సౌండ్ బాక్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి.


 

spot_img
spot_img