Wednesday ,April 16, 2025, 2:25 am
Kuhu World
HomeFeatures1aameబిజినెస్ ఉమెన్ - నళిని అనుమకొండ

బిజినెస్ ఉమెన్ – నళిని అనుమకొండ

spot_img

ఆర్డినరీకి, ఎక్స్‌ట్రార్డినరీకి మధ్య తేడా చాలా చిన్నదే. కానీ ఆ కొంచెమే మామూలు పనిని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ మాటలు ఆమెకు అచ్చంగా సరిపోతాయి. తను ప్రారంభించిన వ్యాపారాన్నిచూస్తే ఎవరైనా సరే ‘ఎక్స్‌ట్రార్డినరీ’ అనాల్సిందే. ఎందుకంటే, మనకుచిరకాలంగా పరిచయమైన తేనెతో ఆమె వ్యాపారం చేస్తున్నారు.

నేను పక్కా హైదరాబాదీ. పుట్టి పెరిగిందంతా ఇక్కడే. తొలి నుంచీ నాకు ఏదైనా వైవిధ్యంగా ప్రయత్నించాలని ఉండేది. అందుకే వ్యాపారం వైపు వచ్చాను. అందులోనూ నేను అందించే ఉత్పత్తిలో ప్రీమియం క్వాలిటీ ఉండాలని, అది కూడా జనానికి అందుబాటులో ఉండాలని కోరుకునేదాన్ని. నా ఆలోచనలకు తగినట్టు ఆరోగ్యానికి మేలు చేసే మేలిమి రకం తేనెల వ్యాపారాన్ని ప్రారంభించాను. ఒక్కో తేనెకు ఓ ఔషధ గుణం ఉంటుంది. ఒకటి కండరాలు పట్టేయడాన్ని తగ్గిస్తే, ఒకటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యవ్వనాన్ని నిలిపి ఉంచేవీ, గాయాలను త్వరగా మాన్పేవీ… ఇలా రకరకాల తేనెలను తీసుకొచ్చాను. రుచి చూస్తే కానీ వాటి ప్రత్యేకత అర్థం కాదు.

నళిని అనుమకొండ

మొదట నేనే..
‘ఒక్కసారి ఉద్యోగంలో చేరితే వ్యాపారం చేయడం కష్టం’, ‘బిజినెస్‌ చేయాలంటే ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండాలి’.. ఇలాంటి మాటలన్నీ నిజం కాదు. ఉద్యోగం చేసే వాళ్లూ, ఇల్లూ పిల్లల్ని చూసుకునే గృహిణులు కూడా వ్యాపారం చేయవచ్చు అనడానికి నేనే ఉదా హరణ. నాన్న మెకానికల్‌ ఇంజినీర్‌, అమ్మ గృహిణి. తమ్ముడు డాక్టర్‌. నేను మాత్రం సాఫ్ట్‌వేర్‌ రంగంలో అడుగుపెట్టా. గత పందొమ్మిదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా.

ప్రస్తుతం రెడీసాఫ్ట్‌ అనే సంస్థలో డైరెక్టర్‌ హోదాలో ఉన్నా. నాకు ఒక బాబు, పాప. ఆయనా సాఫ్ట్‌వేరే. ఇన్ని పనులున్నా నేను నాకు ఇష్టమైన వ్యాపారం మీదే దృష్టి పెట్టా. అంతకు ముందు చిన్న చిన్న బిజి నెస్‌లలో భాగస్వామిగా ఉండేదాన్ని. కొవిడ్‌ రోజుల్లో పూర్తిస్థాయిలో సొంత వ్యాపారంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారం ఎంత ముఖ్యమో తెలిసింది.

తేనె తిరుగులేని ఇమ్యూనిటీ బూస్టర్‌. అలా తేనెల గురించి చదవడం మొదలు పెట్టాను. అందులో ఎన్నో రకాలున్నాయి. విభిన్నమైన ఔషధ గుణాలూ ఉన్నాయి. వాటిని వినియోగదారులకు అందించడమే నా పని అనుకున్నా. అలా, 2022లో నా సంస్థను ప్రారంభించా. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పాలి. నాకు వ్యాపారం కొత్త. మా కుటుంబంలో ఇటువైపు వచ్చిన మొదటి వ్యక్తినీ నేనే. ఎలా వెళ్లాలో మార్గనిర్దేశం చేసేవారూ లేరు.

అందుకే ఆలోచించి తేనెను ఎంచుకున్నా. ఆహార పదార్థాల్ని నిర్ణీత సమయంలోపు అమ్మ లేకపోతే పాడైపోతాయి. కానీ తేనెకు ఎక్స్‌పైరీ ఉండదు. ఎంత పాతబడితే అంత ఆరోగ్యానికి మంచిది.మహిళలకు ఉపాధిమా తేనెలను చూసి కొందరు మహిళలు గైనిక్‌ సమస్యలకు ఔషధంగా పనికొచ్చే ఉత్పత్తుల్నీ తెస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. అలాఆరోగ్యకరమైన టీ పొడులను తయారు చేయడం ప్రారంభించాను.

బ్లూ టీ, మౌంటెన్‌ రోజ్‌ గ్రీన్‌ టీ, క్యామోమిల్‌ టీ లాంటి వాటిని డార్జిలింగ్‌ తదితర చోట్ల కోత సమయం నుంచే ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయిస్తాం. ఫ్రూట్‌ స్వాషెస్‌ కూడా ఉత్పత్తి చేస్తున్నాం. వీటన్నిటినీ స్విగ్గీ మినీస్‌తో పాటు www.trulio.in లో ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఆహార-ఆరోగ్య రంగాల్లో నా కృషికిగాను… ‘ఉయ్‌ డూ’ సంస్థ నుంచి విజనరీ ఉమెన్‌ అవార్డు, గ్లోబల్‌ పినాకిల్‌ సంస్థ నుంచి తెలంగాణ ఎలైట్‌ బ్రాండ్‌ అవార్డు సహా చాలానే పురస్కారాలు అందుకున్నా. అయితే, వీటన్నిటికంటే కూడా.. వ్యాపారం చేసేందుకు నాకు స్ఫూర్తినిచ్చిన విషయం మరోటి ఉంది.

అదే ఉపాధి. ప్రస్తుతం నా దగ్గర పదిహేను మంది మహిళలు పనిచేస్తున్నారు. మరో పదిహేను మంది గృహిణులు నా ఉత్పత్తుల్ని అమ్ముతున్నారు. నేను మా ఉత్పత్తులను రకరకాల ఎగ్జిబిషన్లలో విక్రయిస్తుంటాను. అలా ఒకసారి వీ హబ్‌ దగ్గర పెట్టాం. వాటిని చూసి వీహబ్‌లో చేరమంటూ ఆహ్వానించారు అధికారులు. నాలాంటి ఎంతోమంది మహిళా వ్యాపారవేత్తలను కలిసే వీలు కలిగిందక్కడ.

హిమగిరుల నుంచి..
ప్రత్యేకమైన తేనెలను అన్వేషి స్తున్నప్పుడు హిమాలయాల దగ్గర కొన్ని రకాలు దొరుకుతాయని తెలిసింది. అలా హిమాలయ సానువుల నుంచి మల్టీఫ్లోరా, కాశ్మీరీ అకేషియా, లిచీ, యూకలిప్టస్‌ రకాలు దొరికాయి. తొలిగా ఈ నాలుగింటితో వ్యాపారం ప్రారంభించాను. తర్వాత రెడ్‌ ఫారెస్ట్‌, లిటిల్‌ బీ, లావెండర్‌, వైట్‌ హనీ…ఇలా పదమూడు రకాలను తీసుకొచ్చా. ఇవి తీసే చోటును బట్టి తేనెకు ఆ పేరు వస్తుంది. ఉదాహరణకు లావెండర్‌ హనీని.. లావెండర్‌ తోటల్లో సేకరిస్తారు. ఇది మంచి నిద్రకు,
ఆందోళన, ఒత్తిళ్లను తగ్గించడానికి సాయపడుతుంది. దట్టమైన అడవుల నుంచి తెచ్చిన రెడ్‌ ఫారెస్ట్‌ హనీ యవ్వనాన్ని నిలిపి ఉంచుతుంది. క్యాన్సర్‌ నియంత్రణకు పనిచేస్తుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్‌ కలపకుండా స్వచ్ఛంగా అందించడమే మా పని.


 

spot_img
spot_img