Saturday ,March 7, 2026, 6:44 pm
Kuhu World
Homeఎన్టీఆర్ 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ - నయా అతిలోక సుందరి!

ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ – నయా అతిలోక సుందరి!

spot_img
spot_img

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారతీయ సినిమా ‘దేవర’. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి ప్రేక్షకులకు కూడా తెలుసు.

ఇతర భారతీయ భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే… జాన్వీకి తొలి తెలుగు సినిమా ఇది. ఆల్రెడీ ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే…

దేవరలో ‘తంగం’ గా…

Fashion Ad1

‘దేవర’లో తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. సినిమా సెట్స్ నుంచి మంగళవారం ఆమె కొత్త స్టిల్ విడుదల చేశారు. ఇటీవల వరకు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ‘దేవర’ షూటింగ్ చేశారు. ఇప్పుడు గోవాకు యూనిట్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ కొన్ని సీన్లు తీస్తున్నారు. ఆ తర్వాత గోకర్ణ వెళతారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ ఫస్ట్ పార్ట్ 

‘దేవర’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు కొన్నాళ్ళ క్రితం దర్శకుడు కొరటాల శివ తెలిపారు. అందులో తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 


 

 

spot_img
spot_img
spot_img