ఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరు కానున్నారు.
ప్రధాని సభలో పాల్గొనాల్సిందిగా పవన్ కల్యాణ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లు కోరగా ఆయన అంగీకరించారు.
ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన, గతంలో జరిగిన అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకరించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని, రాబోయే ఎన్నిక్లలో తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు అంశం ఓ కొలిక్కి వచ్చింది. జనసేనకు 9 స్థానాలు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.
ఇందులో భాగంగా – ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కూకట్ పల్లి , వైరా, నాగర్ కర్నూలు – ల లో జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
ఇంకా 3 స్థానాలపై స్పష్టత రాలేదు. తొలుత జనసేన 11 చోట్ల పోటీ చేయాలని భావించినా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో జనసేనాని పవన్ కల్యాణ్ చర్చల అనంతరం – 9 స్థానాలకు ఆ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పని చేయాలని నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.






