Saturday ,March 7, 2026, 3:13 pm
Kuhu World
HomeUncategorizedసీఎం కేసీఆర్  ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు

సీఎం కేసీఆర్  ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు

spot_img
spot_img

మెదక్ జిల్లా నర్సాపూర్ లో జరుగుతున్న సీఎం కేసీఆర్  ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఈ సభలో జనంలో ఒకడిగా వచ్చిన ఓ వ్యక్తి వద్ద రెండు బుల్లెట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అస్లాం అని గుర్తించారు. సభా ప్రాంగణంలోకి వస్తుండగా పోలీసులు అందరినీ తనిఖీలు చేస్తున్న సమయంలో అతని వద్ద ఈ బుల్లెట్లు పోలీసులకు దొరికాయి. అస్లాం అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన యువకుడు. ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

spot_img
spot_img
spot_img