సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
VD12 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్ళిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది గ్యాంగ్ స్టార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విజయ్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు లీకైంది.
గ్యాంగ్‌స్టార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ దేవరకొండ ఓ పోలీసు కానిస్టేబుల్ పాత్రలో నటించనున్నారనేది ఫిల్మ్ లాండ్ లో టాక్.
VD12 చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్డూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
దీనికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.






