తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సినిమా జైలర్ .. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమా 600 కోట్లు వసూలు చేసింది.
గత కొద్దికాలంగో వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడిన రజినీ కాంత్‌కు జైలర్ సూపర్ హిట్ కావడం అద్భుతమైన విజయం. అదిరిపోయే హిట్ కోసం ఎదురుచూస్తున్న తలైవా అభిమానులకు తనివి తీరే విజయం సొంతం చేసుకుంది జైలర్ సినిమా. కొన్ని చోట్ల ఇంకా హౌస్‌ఫుల్ అవుతూందని సమాచారం.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, తమన్నా, మీర్జా మీనన్, రమ్యకృష్ణ, కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ఇలా ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది.
ఇప్పుడీ సినిమా ఓటీటీ విడుదల తేదీ వెల్లడైంది.సెప్టెంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జైలర్ సినిమా విడుదల కానుంది. వాస్తవానికి థియేటర్ రిలీక్ అయిన 4 వారాల తరువాత ఓటీటీలో విడుదల కావల్సి ఉంది.
కానీ జైలర్ సినిమా పైరసీ అవడంతో సెప్టెంబర్ 7వ తేదీనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
భారీ హిట్ సాధించడంతో రజినీకాంత్ ఈ సినిమాకు 200 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.






