సెప్టెంబర్ 15న ‘సోదర సోదరీమణులారా’
కమల్ కామరాజు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తున్నారు. మరో వైపు మంచి కథలు, క్యారెక్టర్లు వస్తే ఇతర హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ ఆయన కనిపిస్తున్నారు.
‘విరూపాక్ష’ చిత్రంలో ఆయన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ ఏడాది ఆయన ఖాతాలో ఓ విజయం పడింది. ఈ వారం హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన రెడీ అయ్యారు.
కమల్ కామరాజు – కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సోదర సోదరీమణురాలా‘. అపర్ణా దేవి ప్రధాన పాత్ర పోషించారు.
దీంతో రఘుపతి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కథను కూడా ఆయనే అందించారు.
9 ఈఎం ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐఆర్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రమిది. విజయ్ కుమార్ పైండ్ల నిర్మాత.
ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నట్లు నిర్మాత తెలిపారు. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.
క్యాబ్ డ్రైవర్ మీద అన్యాయంగా కేసు పెడితే?
‘సోదర సోదరీమణులారా’లో క్యాబ్ డ్రైవర్ పాత్రలో, సగటు మధ్య తరగతి భర్తగా కమల్ కామరాజు నటించారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక సతమతం అవ్వడం కాదు… డబ్బులు లేక పడిన ఇబ్బందులను సైతం ట్రైలర్ లో చూపించారు. కమల్ కామరాజు భార్య పాత్రలో అపర్ణా దేవి నటించారు.






