జకార్తా: తైమూర్-లెస్తె(Timor Leste) లోని దిలీ (Dili) లో భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో జరిగిన 20వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తూ ప్రకటించారు.
“జకార్తాలో జరిగిన ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో, ప్రధాని .. తైమూర్-లెస్టేలోని దిలీలో మా రాయబార కార్యాలయాన్ని తెరవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.
దిలీ … తైమూర్-లెస్తె (లేదా) తూర్పు తైమూర్ దేశ .. ఉత్తర తీరంలోని రాజధాని నగరం. Dili is the capital city of Timor-Leste, or East Timor, on the country’s north coast.
దిలీలో – రాయబార కార్యాలయాన్ని ప్రారంభించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం .. ‘యాక్ట్ ఈస్ట్’ విదేశీ విధానానికి భారత్ ఇస్తున్న ప్రాముఖ్యత ను తెలియ చేస్తుంది. భారత యాక్ట్ ఈస్ట్ విధానంలో ASEAN ప్రధాన స్తంభమని, భారత్ యొక్క ఇండో-పసిఫిక్ భగస్వామ్యం లో ASEAN కు ముఖ్యమైన స్థానం ఉందని ప్రధాని మోదీ అన్నారు.
జకార్తాలో ఉన్న ప్రధాని మోదీ .. సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో జరగనున్న – G20 సదస్సుకు ముందు .. గురువారం సాయంత్రానికి న్యూఢిల్లీకి తిరిగి రానున్నారు.






