ఎవరైతే చౌకగా విమాన టికెట్లను బుక్ చేసుకోవాలని ఆశపడుతున్నారో వారంతా గూగుల్‌లోని కొత్త ఫీచర్‌తో తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చని గూగుల్ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
ఈ ఫీచర్‌తో మీరు విమాన టికెట్ల కోసం ఎక్కువ డబ్బు చెల్లించకుండా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. Google Flights లోని కొత్త ఫీచర్‌తో – విమాన టికెట్లు బుక్ చేయడానికి – బెస్ట్ టైమ్ మరియు బెస్ట్ ప్రైస్ డీల్స్ .. మీకు అందిస్తోంది.
టికెట్ ప్రైజ్ ట్రాకింగ్, ఫ్రైజ్ వార్నింగ్, ప్రైజ్ ప్రామీస్ వంటి ఆప్షన్లతో Google Flights లో ఇప్పటికే ఉన్న ఆప్షన్లతో పాటు ఈ కొత్త ఫీచర్ వస్తోంది.
ట్రెండ్ డేటాను విశ్వసనీయంగా, ఖచ్చితంగా విశ్లేషించడం ద్వారా – Google Flights వినియోగదారులు తమకు కావాల్సిన గమ్యస్థానాలకు- అతి తక్కువ ధరకే విమాన టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా టికెట్ ధరలు అతి తక్కువకే లభిస్తాయని స్పష్టం చేసింది.
Google Flights కొత్త ఫీచర్ వినియోగదారులకు కచ్చితమైన సూచనలను అందించడం ద్వారా పని చేస్తుంది. కొత్త ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే, ఇది మీ సెర్చ్ లో ఉన్న విమానాల మాదిరిగానే – విమాన టికెట్లు బుక్ చేసుకోవడానికి బెస్ట్ టైమ్ ను గుర్తించి – మీకు తెలియజేస్తుంది. మీరు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసి, ఆ తేదీల్లో అవసరమైన టికెట్ కోసం సెర్చ్ చేస్తే, మీరు తక్కువ ధరలో టికెట్ బుక్ చేసుకోవచ్చు.
స్పాట్ లైట్..
కొత్త ఫీచర్ బుకింగ్‌ను నిర్ధారించే ముందు కొంచెం ఓపికగా ఉండాలి. చౌకగా టికెట్లను పొందే అవకాశం ఉంటే, ప్రయాణానికి ముందు అలాంటి తేదీలను వినియోగదారులకు తెలియజేస్తుంది. ఏ రోజు తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందో చూడటానికి బయలుదేరే తేదీకి దగ్గరగా ఉన్న ధరలను చెక్ చేయండి. ఈ డేటా ఆధారంగా ప్రయాణికులు ఉత్తమమైన డీల్స్‌ను కనుగొనడంలో సహాయపడుతుంది.
టేకాఫ్‌కి ముందు..
తాజాగా కొత్త ‘‘ప్రైజ్ గ్యారంటీ’’ బ్యాడ్జ్‌ను కూడా ప్రవేశపెట్టింది. సెర్చ్ ఫలితాల్లో చూపబడే ఈ బ్యాడ్జ్, విమానం బయలుదేరే వరకు టికెట్ ధర మారదని గూగుల్ హామీ ఇస్తుంది. అది హామీ ఇవ్వడమే కాదు.. టేకాఫ్‌కి ముందు రోజులలో, విమాన ఛార్జీలు కీన్ గా ఆబ్సర్వ్ చేసి .. ఏదైనా ధర తగ్గితే ప్రయాణికులకు గూగుల్ పే ద్వారా ‘రీ ఎంబర్స్’ చేయబడుతుంది.
బెస్ట్ డీల్స్..
మీరు చేసే ప్రతి విమాన ప్రయాణంలో బెస్ట్ టైమ్ను కనుగొనేందుకు గూగుల్ డేటా ఉపయోగించబడుతుంది. ఈ కొత్త .. డేటా విశ్లేషణ .. ఫీచర్లు – డిసెంబర్ మధ్య నుంచి ప్రారంభమయ్యే ట్రిప్‌లలో, బెస్ట్ డీల్స్ పొందడానికి – అక్టోబర్ నెల ప్రారంభంలో .. సిద్ధంగా ఉంటాయి..
కొత్త డేటా విశ్లేషణ ప్రకారం, టేకాఫ్‌కు – 54 నుంచి 78 రోజుల ముందు – టికెట్లను బుక్ చేసుకోవడం వల్ల బెస్ట్ డీల్స్ పొందొచ్చు.






