Friday ,June 26, 2026, 8:49 am
Kuhu World
HomeUncategorizedదీపావళికి - వైష్ణవ్ తేజ్‌, శ్రీలీల -'ఆదికేశవ'

దీపావళికి – వైష్ణవ్ తేజ్‌, శ్రీలీల -‘ఆదికేశవ’

spot_img
spot_img

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘ఆదికేశవ’ . ఇందులో శ్రీ లీల కథానాయిక. ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మాతలు.

శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు తెరకెక్కించాయి.


ఆగస్టు 18న కాదు… నవంబర్ 10న!

Fashion Ad1

ఆదికేశవ’తో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను ఈ రోజు (ఆగస్టు 18న) విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం తెలిపారు. అయితే… నేడు సినిమా విడుదల కాలేదు. ఇవాళ కొత్త విడుదల తేదీ వెల్లడించారు.

దీపావళి సందర్భంగా నవంబర్ 10న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఇటీవల ప్యారిస్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. వైష్ణవ్ తేజ్, శ్రీ లీలపై ఓ పాటను తెరకెక్కించారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.


త్వరలో తొలి పాట విడుదల

‘ఆదికేశవ’కు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించిన ‘సార్’కు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు.

‘మాస్టారు మాస్టారు…’ సాంగ్ వైరల్ అయ్యింది. ఇప్పుడీ ‘ఆదికేశవ’కు కూడా అద్భుతమైన బాణీలు అందించారని సమాచారం. త్వరలో ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారు.


spot_img
spot_img
spot_img