సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ అనే సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దర్శకత్వం వహించగా… భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న గ్రాండ్ ’గా విడుదలైంది. తమన్నా హీరోయిన్‌గా చేసింది.
ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రజినీకాంత్ తన స్టైల్, లుక్స్ అండ్ డైలాగ్స్‌తో .. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా లో థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తున్నాయి.
ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా ఒక్క నైజాం ఏరియాలోనే భారీ లాభాలు నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇక్కడ 4.50CR బిజినెస్ జరగగా.. 8.76CR ప్రాఫిట్ వచ్చింది. మొత్తంగా ఈ ఆరు రోజుల్లో కలిపి 13.26CR కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ఆరో రోజు తిరిగి పుంజుకుంది జైలర్. మరోవైపు పెద్ద సినిమాలేవీ పోటీలో లేకపోవడం జైలర్ కి బాగా కలిసొచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలతో ముందుకెళ్తుంది.
జైలర్ ఓటీటీ రైట్స్ ‘సన్ నెక్స్ట్’ దగ్గర ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఈ సినిమా ‘సన్ నెక్స్ట్’ తో పాటు ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుందని.. ఈ రెండు సంస్థలు ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నాయని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ఓటీటీలో ‘దసరా పండుగ’ స్పెషల్‌గా అందుబాటులోకి తెస్తారని టాక్. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.






