Saturday ,March 7, 2026, 6:41 pm
Kuhu World
HomeUncategorizedఅక్టోబర్‌లో - చైనా లో పర్యటనకై - రానున్న పుతిన్‌

అక్టోబర్‌లో – చైనా లో పర్యటనకై – రానున్న పుతిన్‌

spot_img
spot_img

ఈ ఏడాది అక్టోబర్‌లో .. చైనా లో పర్యటనకై .. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ .. రానున్నట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది చివర్లో బీజింగ్‌లో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సు (Belt and Road forum)కు ఆయన హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సదస్సుకు హాజరుకావాలన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Xi Jinping) ఆహ్వానాన్ని పుతిన్‌ అంగీకరించినట్లు బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది.

Fashion Ad1

దీంతో రష్యా అధ్యక్షుడి .. చైనా పర్యటన .. క్రెమ్లిన్‌ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.


ఇటీవలే ద‌క్షిణాఫ్రికాలోని జోహ‌న్నస్‌బ‌ర్గ్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల స‌మావేశాలకు కూడా హాజరుకాలేదు. అయితే వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.

ఇక సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాలకు కూడా పుతిన్‌ వ్యక్తిగతంగా హాజరుకావడం లేదు. జీ20 సమ్మిట్‌లో కూడా వర్చువల్‌గానే పాల్గొంటారని తెలుస్తోంది.

ఉక్రైన్ పై రష్యా యుద్ధ నేపధ్యంలో …పుతిన్‌ తన తొలి విదేశీ పర్యటనకై .. చైనా ను ఎన్నుకున్నారు.


 

spot_img
spot_img
spot_img