నిఖిల్ రీసెంట్ మూవీ ‘స్పై’ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించకపోయినా, మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
‘స్వయంభూ’ పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నది.
ఈ రోజు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. ఈ విషయాన్ని నిఖిల్ అధికారికంగా ప్రకటించారు. ‘The Epic Journey Begins’ అంటూ మూవీకి సంబంధించిన పోస్టర్ ను షేర్ చేశారు.
ఆట్టుకుంటున్న‘స్వయంభూ’ లేటెస్ట్ పోస్టర్
ఈ పోస్టర్‌లో గుర్రంపై ఉన్న నిఖిల్ లుక్ ఆకట్టుకుంటోంది. డ్రాగన్‌పై బాణం గురిపెట్టి ఉన్న నిఖిల్‌ను యోధునిగా చూపించారు మేకర్స్. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో కనిపించారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్ ఆకట్టుకోగా, ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది.
‘స్వయంభూ’ సోసియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది.
ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పని చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఎం ప్రభాహరన్ సెట్టింగ్స్ డిజైన్ చేయగా, వాసుదేవ్ మునెప్ప డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇక ఈ మూవీతో పాటు సుధీర్ వర్మతో నిఖిల్ ఓ సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ‘ది ఇండియా హౌస్’ పేరుతో ఇది తెరకెక్కనుంది. అటు ‘కార్తికేయ3’ కూడా లైనప్ లో ఉంది.






