Saturday ,March 7, 2026, 6:43 pm
Kuhu World
HomeUncategorized‘ఓనం’లో స్మితా స‌బ‌ర్వాల్

‘ఓనం’లో స్మితా స‌బ‌ర్వాల్

spot_img
spot_img

దేశ వ్యాప్తంగా ఓనం పండుగను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.

తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ అధికారి, ఓఎస్డీ స్మితా స‌బ‌ర్వాల్ ఓనం ఫెస్టివ‌ల్ లో పాల్గొన్నారు. కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో ముచ్చ‌టించారు. వారితో పండుగ‌ను జ‌రుపుకున్నారు.

ఫెస్టివ‌ల్ కు సంబంధించి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఫోటోలు పంచుకున్నారు. భార‌తీయ సంస్కృతిలో పండుగల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఉంటుంద‌ని పేర్కొన్నారు స్మితా స‌బ‌ర్వాల్. ఓనంలో పాల్గొన‌డం త‌న‌కు సంతోషాన్ని క‌లుగ చేస్తోంద‌ని తెలిపారు.

Fashion Ad1

ఓనం సుఖ సంతోషాల‌కు, ఆత్మీయ‌త‌కు, అనుబంధాల‌కు ప్ర‌తీక‌. ఓనం గొప్పనైన భావ‌న‌. అదొక అనిర్వ‌చ‌నీయ‌మైన ఆనందాల హ‌రివిల్లు అని .. త‌న అనుభూతిని పంచుకున్నారు .. స్మితా స‌బ‌ర్వాల్..ఈ సంద‌ర్భంగా.

ఇదిలా ఉండగా ఓనం పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు కేర‌ళ రాష్ట్రంలో. కొన్ని రోజుల పాటు సంద‌డి నెల‌కొంటుంది. తెలంగాణ‌, ఏపీ తెలుగు రాష్ట్రాల‌లో సంక్రాంతిని ఎలా జ‌రుపుకుంటారో అలా కేర‌ళ‌లో ఓనంను నిర్వ‌హిస్తారు.

ప్ర‌తి ఏటా ఆగ‌స్టు – సెప్టెంబ‌ర్ లో ఓనం పండుగ వ‌స్తుంది. పాడి పంట‌ల‌కు, సుఖ సంతోషాల‌కు ప్ర‌తీక ఓనం పండుగ‌.


 

spot_img
spot_img
spot_img