Saturday ,March 7, 2026, 6:55 pm
Kuhu World
HomeUncategorizedHYD : సోలార్‌ వెలుగుల్లో సైకిల్‌ ట్రాక్‌ !

HYD : సోలార్‌ వెలుగుల్లో సైకిల్‌ ట్రాక్‌ !

spot_img
spot_img

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సోలార్‌ రూఫ్‌ ట్రాక్‌ సైకిల్‌ ట్రాక్‌లో విద్యుత్‌ దీపాలు వెలిగే ప్రక్రియపై ట్రయల్‌ రన్‌ను హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు మంగళవారం చేపట్టారు.

రెండు మార్గాల్లో మొత్తం 23 కి.మీ మేర నిర్మిస్తున్న సోలార్‌ రూఫ్‌ ట్రాక్‌ సైకిల్‌ ట్రాక్‌పై సోలార్‌ ప్యానల్‌ బిగించి విద్యుత్‌ ఉత్పత్తి పనితీరును, విద్యుత్‌ దీపాలు వెలిగిలే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సోలార్‌ విద్యుత్‌తో వెలుగుతున్న లైట్లతో కనిపిస్తున్న సైకిల్‌ ట్రాక్‌ ఫొటోలను ట్విట్‌ చేశారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలిపారు.

Fashion Ad1
spot_img
spot_img
spot_img